మరోచరిత్ర : ఆండాళ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ , సరిత జంటగా రూపొందిన “మరోచరిత్ర “మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. ఎమ్ ఎస్ విశ్వనాథన్ స్వరపరచిన సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. తమిళ యువకుడిగా కమల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆకలిరాజ్యం : ప్రేమాలయా పిక్చర్స్ బ్యానర్ పై కె బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ , శ్రీదేవి జంటగా రూపొందిన “ఆకలిరాజ్యం “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో కమల్ నిరుద్యోగ యువకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
పుష్పక విమానం : మందాకినీ చిత్ర బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ , అమల జంటగా రూపొందిన సైలెంట్ మూవీ “పుష్పక విమానం “కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బెస్ట్ పాప్యులర్ మూవీ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. బెస్ట్ యాక్టర్ గా కమల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
సాగరసంగమం :పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కె విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , జయప్రద జంటగా రూపొందిన”సాగర సంగమం “మూవీ ఘనవిజయం సాధించి 2 నేషనల్ , 3 ఫిల్మ్ ఫేర్ , ఒక నంది అవార్డ్ అందుకుంది. ఈ మూవీ లో ప్రముఖ గాయని ఎస్ పి శైలజ ఒక కీలక పాత్రలో నటించడం విశేషం.
స్వాతిముత్యం : పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కె విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , రాధికా జంటగా రూపొందిన”స్వాతిముత్యం ” మూవీ ఘనవిజయం సాధించి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అమాయకుడిగా కమల్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
ఇంద్రుడు చంద్రుడు: సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ కృష్ణ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయశాంతి జంటగా రూపొందిన”ఇంద్రుడు చంద్రుడు ” మూవీ ఘనవిజయం సాధించింది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం తో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ కి బెస్ట్ యాక్టర్ గా కమల్ నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: