మొత్తానికి పుష్ప టీం అనుకున్న డేట్ కు సినిమా రిలీజ్ చేయడానికి చాలానే కష్టపడుతుంది. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సూపర్ ఎగ్జైటింగ్ ఫిలిం పుష్ప. ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక అసలే ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు కావడంతో ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ప్రీల్యూడ్ అంటూ విడుదల చేసిన చిన్న వీడియోకే ఫ్యాన్స్ కుషీలో ఉన్నారు.. ఈవీడియోలో బన్నీ మొహం చూపించకుండానే మాయచేసేశాడు. సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఈ చిన్న వీడియోకి. దీంతో బన్నీ బర్త్ డేకు టీజర్ వస్తుందా లేదా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందా అని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా డబ్బింగ్ ను నేటి నుండి ప్రారంభిస్తున్నట్టు తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిజానికి సినిమా ప్రారంభం రోజు పూజ చేస్తారు.. కానీ డబ్బింగ్ కూాడా పూజా కార్యక్రమాలు నిర్వహించి మరీ ప్రారంభిస్తున్నారంటే ఈ ప్రాజెక్ట్ ను ఎంత ప్రస్టేజియస్ గా తీసుకున్నారో అర్ధమవుతుంది.
#Pushpa Dubbing starts 💥
Get ready to meet the ferocious #PushpaRaj tomorrow at 6:12 PM on https://t.co/HAAp3j3sNO 🔥@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/SF8vuRLeOp
— Mythri Movie Makers (@MythriOfficial) April 6, 2021
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో చేస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం, టెన్ కాశీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. తర్వాతి షెడ్యూల్ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: