బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సాయి పల్లవి టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ఏప్రిల్ 16 వ తేదీ ,”విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. తాను అందగత్తె ను కాను అని నిజాయతీగా అంగీకరించే సాయి పల్లవి తన ప్రతిభ తో ప్రేక్షకులకు అందంగా కనపడుతున్నారు. “లవ్ స్టోరీ “మూవీ లో సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన “సారంగ దరియా “సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టైలిస్ట్ నీరజ కోన ఫర్ లవ్ స్టోరీ ప్రమోషన్స్ అంటూ శారీ ధరించిన సాయి పల్లవి ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: