రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలోయదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన “విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన “విరాటపర్వం “మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏప్రిల్ మొదటి వారం నుండి “విరాటపర్వం ” మూవీ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టాలని హీరో రానా ప్లాన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో పర్యటించి మూవీ ని ప్రమోట్ చేయాలని హీరో రానా &టీమ్ నిశ్చయించారని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “విరాటపర్వం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి “లవ్ స్టోరీ “, “శ్యామ్ సింగ రాయ్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నవిషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: