మొత్తానికి థమన్ చెప్పినట్టే మార్చి నెల మొత్తాన్ని మ్యూజికల్ ఫెస్ట్ గా మార్చేశారు వకీల్ సాబ్ చిత్రయూనిట్. గత ఏడాది మగువ మగువ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ నెలలో సత్యమేవ జయతే.. రీసెంట్ గా కంటి పాప. కంటిపాప అనే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మూడు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా మ్యూజిక్ ఫెస్ట్ ను ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ఈనేపథ్యంలో దుండిగల్‌లోని MLRIT కాలేజీలో ఈరోజు మధ్యాహ్నం నుండి మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#VakeelSaabMusicalFest 🎶 🎼 On The Roll
Today at MLRIT College,Dundigal from 2️⃣PM#VakeelSaabOnApril9th pic.twitter.com/s8tMygCsPl
— Sri Venkateswara Creations (@SVC_official) March 20, 2021
ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవితోపాటు.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా వస్తున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా రీచ్ అవుతుందా లేదా చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: