కర్నూల్ లో ‘రంగ్ దే’ ట్రైలర్

Rang De Movie Team Plans To Launch Movie Trailer In Kurnool,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rang De On March 26,Rang De,Rang De Movie,Rang De Film,Rang De Telugu Movie,Rang De Movie Telugu,Rang De Update,Rang De Movie Latest News,Rang De Movie Latest Updates,Rang De Movie News,Rang De Trailer,Rang De Movie Trailer,Rang De Telugu Movie Trailer,Rang De Trailer Update,Rang De Trailer News,Rang De Trailer Release News,Nithiin,Actor Nithiin,Hero Nithiin Rang De Trailer,Rang De Team Plans To Launch Movie Trailer In Kurnool,Rang De Movie Trailer Launch Event,Rang De Trailer Launch Event,Rang De Trailer Launch Event On March 19th,Rang De Trailer Launch Event In Kurnool,Rang De Trailer Launch News,Keerthy Suresh

గత ఏడాది సినిమాలు లేకపోవడంతో ఈఏడాది ఎలా లేదనుకున్నా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో అలరించడానికి రెడీ అయిపోయాడు నితిన్. ఇప్పటికే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన నితిన్ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ పలు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలోభాగంగానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ను కాస్త వినూత్నంగా ప్లాన్ చేశారు. మార్చి 19న కర్నూల్ లో ఒక ఈవెంట్ నిర్వహించి అక్కడ రిలీజ్ చేయనున్నారు. కర్నూల్ లోని ఏస్టీబీసీ కాలేజ్ లో ఈకార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటల నుండి జరిగే ఈ కార్యక్రమంలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.