దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొనివేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా స్టైలిష్‌గా ఉన్న పవన్ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన థమన్ దానికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. పవన్ స్టైల్, స్వాగ్ సూపర్ అని కామెంట్ చేశాడు. ఇక ఈఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#VakeelSaab ⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/C4j13XIBsg
— thaman S (@MusicThaman) February 7, 2021
ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























