కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గతం’. సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇక టీజర్,ట్రైలర్ లతోనే సినిమాపై అంచనాలు పెంచిన ఈ థ్రిల్లర్.. సినిమా కూడా అదే రేంజ్ లో ఉండి మంచి ప్రశంసలు దక్కించుకుంది. చాలా గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో.. మిస్టరీ గా ఉందన్న మంచి టాక్ ను అయితే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన అవకాశాన్ని దక్కిందసుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఫంక్షన్‌లో పనోరమా కేటగిరీలో ప్రదర్శితమయ్యే సినిమాగా స్థానాన్ని సంపాదించుకుంది. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో.. బెస్ట్ ఇండియన్ సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ప్రతి సంవత్సరం ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇప్పుడు గతం సినిమాకు ఇలాంటి అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం. జనవరి 17న గోవాలో ఈ కార్యక్రమం జరగనుంది.
కాగా ఆఫ్ బీట్ ఫిలిమ్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై భార్గవ పొలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు ఈ సినిమాను నిర్మించనున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































