‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ రిలీజ్

Hero Sai Dharam Tej, Sai Dharam Tej, Sai Dharam Tej Latest News, Sai Dharam Tej Solo Brathuke So Better Trailer, Sai Dharam Tej’s Solo Brathuke So Better Trailer Out Now, Solo Brathuke So Better, Solo Brathuke So Better Movie, Solo Brathuke So Better Movie Updates, Solo Brathuke So Better Telugu Movie, Solo Brathuke So Better Telugu Movie Latest News, Solo Brathuke So Better Trailer, Solo Brathuke So Better Trailer Out, Telugu Film News 2020, Telugu Filmnagar

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక డిసెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ పెళ్ళికి చాలా దూరంగా ఉండేలా క‌నిపిస్తున్నాడు. న‌భా న‌టేష్‌ని క‌లిసిన త‌ర్వాత త‌న అభిప్రాయంలో మార్పులు వ‌స్తాయేమోన‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. నభా నటేష్, రావు రమేష్, సత్య తదితరులు ఆకట్టుకున్నారు. ట్రైలర్ చివర్లో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ‘మనిషి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.. పెళ్లి చేసుకోవాలి.. మంచిగా ఉండండి’ అని చెప్పడం హైలెట్‌గా నిలిచింది.

కాగా `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =