గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పై ప్రశాంత్ వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలనటునిగా ఎన్నో సినిమాల్లో అలరించిన తేజ సజ్జా ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకూ, మోషన్ పోస్టర్‌కూ రిలీజ్ అవ్వగా వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేసారు చిత్రయూనిట్. ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైనట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
View this post on Instagram
కాగా ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ జాంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. మరి సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా ‘అ’ సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్‌తో చేసి ఆకర్షించారు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























