బిగ్ బాస్4 – కెప్టెన్ గా అమ్మ రాజశేఖర్

Bigg Boss Telugu 4 Highlights: Amma Rajasekhar Becomes House Captain

బిగ్ బాస్4 ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో’ టాస్కులో భాగంగా హారిక కెప్టెన్సీ పోటీకి అర్హత పొందగా.. అమ్మ రాజశేఖర్ కు గతవారం నాగార్జున డైరెక్ట్ గా కెప్టెన్సీ పోటీకి అర్హత కలిగించారు. ఇక మూడో కంటెండర్ గా అరియానా ఎంపిక అవ్వగా వారి ముగ్గురికి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. “రింగులో రంగు” అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో హారిక‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్ రింగులో క‌ళ్ల‌కు గంత‌లు కట్టుకుని ఉంటారు. చేతిని రంగులో ముంచి ఒక‌రికి మ‌రొక‌రు అంటించుకోవాలి. ఈ టాస్కులో మాస్ట‌ర్ హారిక మీద.. అరియానా మీద రంగు పూర్తిగా రాయడంతో అస‌లు రంగు ప‌డ‌కుండా త‌ప్పించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ కెప్టెన్ అయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కెప్టెన్ అయిన అమ్మ రాజశేఖర్ అవినాష్‌ని రేష‌న్ మేనేజ‌ర్‌గా నియ‌మించాడు. ఇక ఆ త‌ర్వాత ప‌నిష్మెంట్‌ల‌కు సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేశాడు. అరియానాను త‌న‌ అసిస్టెంటుగా నియ‌మించుకున్నాడు. మైకు మ‌ర్చిపోతే జైలుకు పంపిస్తానన్నాడు. నిద్ర పోతే బెడ్‌రూమ్ మొత్తం శుభ్రం చేయాల‌ని ఆదేశించాడు. ఇంగ్లీషులో మాట్లాడితే త‌న‌కు న‌చ్చినంత సేపు నిల‌బెడ‌తాన‌న్నాడు. మైకుల బ్యాట‌రీ కోసం బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు స్టోర్ రూమ్‌లోకి చిట్ట చివ‌ర వ‌చ్చిన‌వారి వారి గుడ్డు మొద‌ట అడుగు పెట్టిన వాళ్ల ఖాతాలోకి వెళుతుంద‌ని చెప్పుకొచ్చాడు. ఇక రూల్స్ విన్న హౌస్ మేట్స్ ఖంగుతిన్నారు..

ఆ త‌ర్వాత క్యారెట్ హ‌ల్వా చేయ‌మ‌ని బిగ్‌బాస్‌ టాస్క్ ఇచ్చాడు. ఇందులో మోనాల్‌, లాస్య చెఫ్‌లుగా అవ‌తార‌మెత్తి హ‌ల్వా చేశారు. నాకు మోనాల్ చేతి వంట ఎలా ఉంటుందో తెలుసు, లాస్య‌క్క‌నే బాగా చేస్తుంద‌ని అభిజిత్ రుచి చూడ‌క‌ముందే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశాడు. కానీ కెప్టెన్ మాత్రం ఇద్ద‌రినీ విజేత‌లుగా ప్ర‌క‌టించాడు.

మరోవైపు మధ్యాహ్నం లాస్య, హారిక, మోనాల్ ముగ్గురు లంచ్ ప్రిపేర్ చేయాలని మాస్టర్ అన్నారు. మార్నింగ్ టిఫిన్ చేసిన వాళ్లే నైట్ కూడా డిన్నర్ చేస్తారని చెప్పారు. ఇక అసిస్టెంట్‌గా అరియానాని నియ‌మించుకున్న మాస్ట‌ర్ ఎవ‌రు ఏం చేయ‌క‌పోయిన త‌న‌కి వ‌చ్చి చెబుతుంద‌ని అన్నాడు. మెహబూబ్, అవినాష్ బాత్ రూంలు క్లీన్ చేయాలని ఆదేశించారు. అయితే మాస్ట‌ర్ పెట్టిన రూల్స్ సరిగ్గా లేవ‌ని ఇంటి స‌భ్యులు వాదించారు. హారిక అయితే తాను చేయ‌న‌ని వెళ్లిపోయింది కూడా. మెహ‌బూబ్‌, అవినాష్ బాత్రూమ్‌ క్లీన్ చేస్తార‌ని మిగిలిన‌ ప‌నుల‌న్నీ మిగ‌తావాళ్లు చేస్తారని చెప్పడంతో షాకైన‌ ఇంటిస‌భ్యులు తాము చేయ‌మ‌ని తేల్చి చెప్పారు. ఆ తర్వాత మెహ‌బూబ్‌, అవినాష్ మ‌రికొన్ని ప‌నులు చేస్తామని ముందుకు వచ్చారు. అమ్మ రాజశేఖర్ ప‌క్క‌కు వెళ్లి మెహ‌బూబ్‌, అవినాష్‌ల‌కు క్లాసు పీకాడు. వేరే ప‌నులు చేస్తామ‌ని ఎందుకు ఒప్పుకుంటున్నార‌ని తిట్టిపోశాడు.

కొద్ది సేప‌టి త‌ర్వాత ఈ విష‌యంపై అఖిల్, లాస్య‌, హారిక‌ల‌తో అభిజిత్ డిస్క‌స్ చేస్తూ ఇంగ్లీష్‌లో మాట్టాడాడు. దీంతో అతనికి కెప్టెన్ ప‌నిష్‌మెంట్ ఇచ్చాడు. త‌ను చెప్పేంత‌వ‌ర‌కు నిలుచోమ‌ని చెప్ప‌డంతో త‌ప్పక నిలుచున్నాడు అభి. ఆ త‌ర్వాత ఇంట్లో క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న మెహ‌బూబ్, సోహైల్‌లు గొడ‌వ‌ప‌డ్డారు. ఓ విష‌యంలో నీ ఫ్రెండ్షిప్ వ‌ద్ద‌ని మెహ‌బూబ్ అన‌డంతో చాలా హ‌ర్ట్ అయిన సోహైల్ ర‌చ్చ చేశాడు. అన్నింటిని త‌న్నుకుంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. అఖిల్‌, అవినాష్‌లు ఇద్ద‌రిని క‌లిపే ప్ర‌య‌త్నం చేశారు.

మరి ఈవారం అమ్మ నామినేషన్ లో వున్నాడు. ఈ వారం ఉంటాడా లేకపోతే ఎలిమినేట్ అవుతాడా అన్న విషయం తెలియాలంటే రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే. పొరపాటున ఉంటే ఈవారం అమ్మ కెప్టెన్సీ లో ఎన్ని గొడవలు అవుతాయో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.