గతం రివ్యూ – సూపర్ సైకలాజికల్ థ్రిల్లర్

Gatham Review: An Edge Of The Seat Physcological Thriller

కరోనా వల్ల థియేటర్స్ మూతపడటంతో ఇప్పటికే ఓటీటీ వేదికగా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో చిత్రం ఓటీటీ వేదికపైకి వచ్చేసింది. కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గతం’. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పరుచుకుంది. ఇక అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : భార్గవ పోలుదాసు, రాకేశ్ గలేభే, పూజిత కురపర్తి, హర్ష వర్ధన్ ప్రతాప్, లక్ష్మీ భరద్వాజ్
దర్శకత్వం : కిరణ్ కొండమడుగుల
నిర్మాత : ఎస్ ఒరిజినల్స్, ఆఫ్ బీట్ ఫిల్మ్స్
మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి

కథ..

రిషి(రాకేష్) అమెరికాలో ఉన్న ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతుంటాడు. అయితే సడెన్ గా ఒకరోజు సడెన్ గా ట్రీట్మెంట్ నుంచి లేచి బయటకు వస్తాడు. అయితే అంతకుముందే జరిగిన కారు యాక్సిడెంట్ వల్ల అప్పటికే తన గతం మరిచిపోయి ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా రిషి గర్ల్ ఫ్రెండ్ అదితి(పూజిత). తనే రిషిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక గతాన్ని మరిచిపోయిన రిషిని అతడి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆ క్రమంలో అతడిని కారులో తీసుకెళ్తుండగా సడెన్ గా రోడ్ పై వారి కారు బ్రేక్ డౌన్ అవుతుంది. అదే సమయంలో వారికి ఒక గుర్తు తెలియని వ్యక్తి(భార్గవ పోలుదాసు) ఇద్దరికీ లిఫ్ట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్తా అని చెపుతాడు. అయితే రిషి, అదితిలను టార్గెట్ చేసాడని తెలుసుకుంటారు. మరి ఇంతకీ ఈ అజ్ఞ్యాత వ్యక్తి ఎవరు? రిషి, అదితిలను ఎందుకు టార్గెట్ చేసాడు..? రిషి ఎందుకు గతం మర్చిపోయాడు..? మళ్లీ గతం గుర్తొస్తుందా..? అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ..

తెలుగు ప్రేక్షకులు థ్రిల్లర్ సినిమాలు ఇప్పటికే ఎన్నో చూసుంటారు. అయితే ఈ జోనర్ అంటే మనవాళ్లకు ఎప్పుడూ ఇంట్రెస్టే. కాస్త కొత్తగా చూపించగలిగి.. థ్రిల్లింగ్ కు గురిచేసి ఎంగేజ్ చేస్తే చాలు సినిమా హిట్ అయినట్టే. ఇక ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

భార్గవ పోలుదాసు, రాకేశ్ గలేభే చాలా బాగా నటించారు. ఇది వారికి మొదటి సినిమా అనేలా వారి నటన ఎక్కడా కనిపించదు. రాకేష్ తన రోల్ కు సెటిల్డ్ గా పర్ఫెక్ట్ గా చేసాడు. విలన్ రోల్ లో కనిపించిన భార్గవ్ తన పాత్రలో జీవించేసాడు. ఇక సినిమా అంతా సపోర్టింగ్ రోల్ లో ఆధ్యంతం కనిపించిన హీరోయిన్ పూజిత మంచి నటనను కనబరిచింది. హర్ష వర్ధన్ ప్రతాప్, లక్ష్మీ భరద్వాజ్ మిగిలిన నటీనటులు వారి పాత్ర మేర వారు నటించారు.

ఈ సినిమాకు ముఖ్యంగా హైలైట్ పాయింట్ ఏంటంటే విజువల్స్. కెమెరా వర్క్ సూపర్. అమేజింగ్ విజువల్స్ ను చూపించారు. కొన్ని డ్రోన్ షాట్స్ చూస్తే హాలీవుడ్ టేకింగ్ లా కూడా అనిపిస్తుంది. ఇక మరో హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్రిల్లర్ సినిమాలకు సగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ప్లస్ అవుతుంది. ఈ సినిమాకు కూడా అదే ప్లస్ ఐంది. శ్రీచరణ్ పాకల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంప్రెసివ్ గా ఉంది.

డైరెక్టర్ కథను చాలా చక్కగా రాసుకున్నాడు. కథ ప్రకారం ఎక్కడ ట్విస్ట్ లు రావాలి అన్న విషయాలు బాగా రాసుకున్నాడని చెప్పొచ్చు. వీటితో పాటుగా సినిమాలో సాగే ఇన్వెస్టిగేషన్, మరికొన్ని ఆసక్తికర అంశాలు బాగా అనిపిస్తాయి. తక్కువ పాత్రలతోనే మంచి అవుట్ ఫుట్ వచ్చేలా చూసుకున్నాడు. ఇక క్లైమాక్స్ కూడా డీసెంట్ గా ముగించాడు.

ఇక ఫైనల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు మాత్రమే కాకుండా.. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.