మహానటి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కీర్తి సురేష్ చేస్తున్న సినిమాల్లో ‘మిస్ ఇండియా’ సినిమా కూడా ఒకటి. నరేంద్ర దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా స్టార్ట్ చేశారు. ఇప్పటీకే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఇక ట్రైలర్ ను చూస్తుంటే .. కీర్తి సురేష్ కు జగపతి బాబు కు మధ్య బిజినెస్ వార్ నడుస్తుందని అర్ధమవుతుంది. ఎంబీఏ చదివి బిజినెస్ రంగంలోకి దిగి ఎదగాలనుకున్న ఓ అమ్మాయిని వారి ఇంట్లోనే వాళ్లు ఉద్యోగం చేయాలని ఒత్తిడి చేయడం, అయినప్పటికీ బిజినెస్ రంగంలోకి ప్రవేశించి అన్ని సమస్యలను అధిగమించి ఎలా గెలిచింది అన్నదే కథ అని తెలుస్తుంది. ‘వ్యాపారం అంటే ఆడపిల్లలు ఆడుకునే ఆటలు కాదు.. అదొక యుద్దం’ అని జగపతి బాబు ఓ డైలాగ్ చెబుతాడు. తాను బిజినెస్ చేయడానికి పుట్టానని దాని కోసం ఏదైనా చేస్తానని కీర్తి సురేష్ చెప్పిన డైలాగ్ బావుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























