శివాత్మిక ధైర్యంగా ఉండండి – రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకుంటారు

రాజశేఖర్ దంపతులు ప్రస్తుతం కరోనాకు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ రోజు ఉద‌యం త‌న తండ్రి ఆరోగ్యం గురించి శివాత్మిక‌ తన ట్విట్టర్ ద్వారా.. నా తండ్రి కరోనాతో ధైర్యంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. త‌ప్పుడు వార్త‌లను ప్ర‌చారం చేయోద్దు. అంద‌రు ధైర్యంగా ఉండండి అని తన ట్వీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దానికంటే ముందు ఆరోగ్య ప‌రిస్థితి కాస్త డిఫికల్ట్ గా ఉందని.. నాన్న కాస్త క‌ష్టంగా క‌రోనాతో పోరాడుతున్నారు. మీ ప్రేమ‌, అభిమానం, ప్రార్ధ‌న‌లు ఆయ‌నని కాపాడ‌తాయ‌ని భావిస్తున్నాము. నాన్న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌తి ఒక్కరిని ప్రార్ధిస్తున్నాను. మీ ప్రేమ‌తో ఆయ‌న క్షేమంగా తిరిగి వ‌స్తార‌ని ఆశిస్తున్నాను అంటూ శివాత్మిక త‌న ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ పై చిరు స్పందించి.. డియ‌ర్ శివాత్మిక .. మీ నాన్న‌, నా స్నేహితుడు రాజ‌శేఖర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండండి. అంద‌రి ప్రార్ధ‌న‌ల‌తో రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను అని చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా ఇటీవలే రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు కూతుర్లు కోలుకున్నారు. ప్రస్తుతం రాజశేఖర్-శివాత్మిక హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాజశేఖర్‌..ప్రముఖ దర్శకుడు నీలకంఠ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఓ హిట్ ఫిల్మ్‌కు రీమేక్‌గా రానున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. “యముడికి మొగుడు “మూవీ ఫేమ్ రిచా పనాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. జీవిత రాజశేఖర్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.