గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా మోస్ట్ అవేటెడ్ గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘వారణాసి’ శరవేగంగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఈరోజు ఓ సర్‌ప్రైజ్ బయటకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జోనస్ పుట్టినరోజుసందర్భాన్ని పురస్కరించుకుని, చిత్ర యూనిట్ ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన పవర్‌ఫుల్ అఫీషియల్ న్యూ లుక్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె ‘మందాకిని’ అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది.
తాజాగా విడుదల చేసిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టిల్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ..”ఆమె నవ్వితే ఒక అందమైన అందం.. నవ్వకపోతే ఒక పెను నిప్పు అంటూ క్యాప్షన్ ఇచ్చారు రాజమౌళి.
ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే గ్లోబ్ ట్యాటర్ పాత్రతో పాటు, దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఎపిక్ రామాయణ యుద్ధ సన్నివేశంలో శ్రీరాముడిగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు .మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి (విలన్) పాత్రలో నటిస్తున్నారు.
ఈ భారీ పాన్-వరల్డ్ చిత్రం ప్రాచీన నాగరికతల నుండి ఆధునిక కాలం వరకు, అంటార్కిటికా, ఆఫ్రికా నుండి పవిత్ర నగరం వారణాసి వరకు అనేక ఖండాల చుట్టూ తిరిగే అద్భుతమైన కథాంశంతో రూపొందుతోంది. 2027 ఏప్రిల్ 7 న ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లపై ల్యాండ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























