నేను ఎంత ఒంటరిదాన్నో లాక్ డౌన్ లో తెలిసింది

Shruti Haasan Makes An Interesting Revelation From Her Lockdown Experience

ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అలవాటు శ్రుతి హాసన్ ది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ హైద్రాబాద్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తీసేసినప్పుడే ఇక్కడికి వచ్చేసింది. ప్రస్తుతం ఈ భామ క్రాక్ సినిమా షూటింగ్ లో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ లాక్ డౌన్ లో చాలా విషయాలు తెలుసుకున్నా అంటుంది శృతి హాసన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మనుషుల గురించి, మానవత్వం గురించి, మన బలాలు, బలహీనతల గురించి ఈ సంవత్సరం ఎంతో నేర్చుకున్నానని శ్రుతి తెలిపింది. తాను ఎంత ఒంటరి వ్యక్తినో, తనకు మనుషులు ఇచ్చే విలువ ఏంటో తెలుసుకున్నానని చెప్పింది. ముఖ్యంగా తనను తాను ఎలా ప్రేమించుకోవాలనే విషయాన్ని నేర్చుకున్నానని తెలిపింది.

2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్‌లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్‌లో ‘బెహెన్‌ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు సినెమాలపై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం శృతి హాసన్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న “క్రాక్ ” మూవీ లో నటిస్తుంది. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.