పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో ఉపేంద్ర సక్సెస్ ఫుల్ హీరో , దర్శకుడిగా శాండల్ వుడ్ లో కొనసాగుతున్నారు. “కన్యాదానం “, “S/O సత్యమూర్తి ” వంటి మూవీస్ తో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఉపేంద్ర హీరోగా రూపొందిన పలు కన్నడ మూవీస్ తెలుగు లో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ అయ్యి విజయం సాధించాయి. బెస్ట్ యాక్టర్ , బెస్ట్ డైరెక్టర్ గా పలుమూవీస్ కు ఉపేంద్ర అవార్డ్స్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ , లిరిసిస్ట్ , రైటర్ , సింగర్ , ప్రజాకీయ పొలిటికల్ పార్టీ వ్యవస్థాపకుడు ఉపేంద్ర పుట్టిన రోజు సెప్టెంబర్ 18 వ తేదీ, ఆ రోజు అభిమానులతో కలసి తన బర్త్ డే ను ఉపేంద్ర జరుపుకుంటారు. ఈ సంవత్సరం కరోనా కారణం గా తన బర్త్ డే వేడుకలకు ఉపేంద్ర దూరం అయ్యారు. కొవిడ్ -19 కేసులు అధికంగా ఉండడంతో తన బర్త్ డే వేడుకలు జరపవద్దని ఉపేంద్ర అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ .. ఎప్పుడూ తన బర్త్ డే ను అభిమానులతో జరుపుకొంటాననీ , కరోనా కారణంగా తన బర్త్ డే ను జరుపుకోకూడదని నిర్ణయం తీసుకోన్నాననీ , కొన్ని రోజుల పాటు ఊరి లో ఉండననీ , తన ఇంటివద్ద అభిమానులు గుమిగూడ వద్దనీ ఉపేంద్ర అభిమానులను కోరారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























