తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. సినీ పరిశ్రమ పుట్టినదగ్గరనుండి ఇప్పటికీ కనీసం కొన్ని వందలలో హీరోయిన్స్ వెండి తెరను ఏలి వుంటారు. కానీ కొంతమంది మాత్రం తమ ముద్రని అలా వేసి ఉంచుతారు. అందరికంటే భిన్నంగా వుంటారు. అందుకే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి హీరోయినే అలనాటి తార భానుమతి రామకృష్ణ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భానుమతి రామకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటి, దర్శకురాలు, గాయకురాలు, నిర్మాత, స్టూడియో నిర్వాహకురాలు, చిత్రకారిణి, జోతిష్యం చూడటం కూడా తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కళలు ఆమె సొంతం. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలి అనే బిరుదు ఆమెకే సొంతం. ఆమెను చూస్తే ఆమె ముఖంలో ధైర్యం తాండవిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తక్కువ కాదు అని అన్ని విషయాల్లోనూ ఎప్పుడూ ముందుండేది. అప్పట్లో హీరోలే ఆమెతో మాట్లాడటానికి భయపడే వారంటేనే అర్ధం చేసుకోవచ్చు భానుమతి గారు ఎలా ఉంటారో.

నిజానికి భానుమతి గారు ఎప్పుడూ నటి అవ్వాలని కోరుకోలేదట. తన తల్లి గారికి సంగీతం రావడంతో తాను కూడా గాయకురాలిగా స్థిరపడాలనే కోరిక బలంగా ఉండేదట. అయితే, ఆమెను సినిమాలు వదల్లేదు. సినిమా పరిశ్రమలో ఆమె సాధించాల్సిన ఎన్నో రికార్డ్స్ ఉండటంతో విధి కూడా అదే బలంగా కోరుకుంది. నటిగా వెండి తెరపై వెలుగులు చిమ్మింది. తన సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. డైరెక్షన్ అంటే కేవలం మగవారే కాదు ఆడవాళ్లు కూడా చేయొచ్చు అని చూపించిన హీరోయిన్ భానుమతి. అందుకే ఇండియా లో మొదటి మహిళా డైరెక్టర్ గా రికార్డ్స్ లోకి ఎక్కారు. అంతేకాదు మొదట ద్విపాత్రిభినయం చేసిన హీరోయిన్ కూడా భానుమతే. 1952 లో తెలుగు, తమిళం, హందీలలో తీసిన చండీరాణి సినిమానకు దర్శకత్వం వహించడమే కాదు… ద్విపాత్రిభినయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి తెలుగు సినిమా అంటే మగవారి ఆధిక్యత వుంటుంది అని చెప్పుకునే ఆ రోజుల్లోనే తన సత్తాచాటిన భానుమతి గారు చరిత్ర లో ఎప్పటికి నిలిచిపోతారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























