‘అల వైకుంఠపురములో’ కోసం అడిషనల్ ట్రాక్స్

Music Director Thaman To Add Additional Tracks On Alavaikunthapurramulo Original Sound Track

‘అలవైకుంఠపురములో’ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. ‘సామాజ వరగమనా’ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. ‘బుట్ట బొమ్మ’, రాములో రాములా’ పాటలు కొత్త కొత్త రికార్డులు  క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. మొత్తంగా సోషల్ మీడియాలో 1 బిలియన్ వ్యూస్ వరకూ వచ్చాయి ఈ ఆల్బమ్ కి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు అల వైకుంఠపురములో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అడిషనల్ ట్రాక్స్ అందిస్తున్నట్టు తెలిపాడు థమన్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

 

కాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇక వరుస హిట్స్ తో థమన్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు పలు సినిమాలకు పని చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. సాయి ధరమ్ తేజ్” సోలో బ్రతుకే సో బెటర్”, రవితేజ మూవీ “క్రాక్”, కీర్తి సురేష్ “మిస్ ఇండియా”, నాని “టక్ జగదీష్”, వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వీటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB 27, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీస్ కు కూడా థమన్ పేరే వినిపిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 8 =