ప్రియదర్శి ‘కంబాలపల్లి కథలు’

Actor Priyadarshi Kickstarts Movie Shooting of His New Movie Kambalapally Kathalu

పెళ్లి చూపులు సినిమాలో తన తెలంగాణ డైలాగ్స్ తో అందరినీ నవ్వించిన ప్రియదర్శి ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నా చావు నేను చస్తా అనే బుక్ రాస్తానని చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కమెడియన్ గానే కాకుండా హీరోగా ‘మల్లేశం’ ‘మిఠాయి’ అనే చిత్రాల్లో నటించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రియదర్శి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అనుబంధం సంస్థ స్వప్న సినిమాస్‌ బ్యానర్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మితమవుతోంది. ‘కంబాలపల్లి కథలు’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ తాజాగా ప్రారంభమైంది. ఉదయ్‌ గుర్రాల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సిరీస్ లో ప్రియదర్శి హైబత్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. వరంగల్‌ దగ్గర ఉన్న పల్లెటూరు కంబాలపల్లి. కాబట్టి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుందట. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు ప్రియదర్శి. తన ట్విట్టర్ లో ఆ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ కార్డ్ ఉన్న బోర్డుని చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోని పోస్ట్ చేశాడు ప్రియదర్శి.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 16 =