‘మెలొడీ బ్రహ్మ’ గురించి మీకు తెలుసా..?- 2 దశాబ్దాలు.. ఒక్క ఆడియో ఫంక్షన్ మాత్రమే..!

Tuesday Trivia: Interesting Fact about Melody Brahma Mani Sharma

మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు మణిశర్మ అని. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు.. ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించాడు మణిశర్మ. ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర పనిచేసిన ఆయన “సూపర్ హీరోస్” చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. ఒక పదేళ్లు వెనక్కి వెళితే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గానే దాదాపు అన్ని సినిమాలూ ఉండేవి. కెరీర్ మొదట అగ్ర తారల సినిమాలకు మ్యూజిక్ అందించి.. అగ్రతారల మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎన్నో మెలోడీ సాంగ్స్ అందించారు. ఇరవై రెండేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని విజయాల్ని సొంతం చేసుకున్నారాయన. పెరిగిపోతున్న కాంపిటీషన్ వల్ల కొన్నేళ్లు గ్యాప్ వచ్చింది. ఈ మ‌ధ్య దేవి శ్రీ ప్రసాద్, థ‌మ‌న్‌ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా దూసుకొచ్చేసారు వారితో పాటు కొత్త కొత్త సంగీత దర్శకులు కూడా వస్తుండటంతో కాస్త జోరు త‌గ్గించాడు మ‌ణిశ‌ర్మ‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మధ్యకాలంలో అమీతుమీ, ఫ్యాష‌న్ డిజైన‌ర్, శ‌మంత‌క‌మ‌ణి, లై సినిమాల‌కు సంగీతం అందించాడు మ‌ణిశ‌ర్మ‌. అయితే అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కొన్ని సినిమాల‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. నాని‌ జెంటిల్మెన్ సినిమాకు మణిశర్మనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

ఇక ఇదిలా ఉండగా మణిశర్మ గురించి ఒక ఆసక్తికరమైన విషయం మీకు తెలుసా. నిజానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆడియో లాంచ్ కూడా ఒకటి. ఇక ఆయా సినిమాలకు పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్స్ ఆడియో ఫంక్షన్స్ లో పాల్గొనడం కూడా పరిపాటే. అయితే ఈ విషయంలో మాత్రం మణిశర్మ కాస్త డిఫరెంట్. తనకు మొదటి నుండి ఆడియో ఫంక్షన్స్ కు మణిశర్మ చాలా దూరం. అందుకే రెండు దశాబ్దాలలో మణిశర్మ ఏ ఒక్క ఆడియో ఫంక్షన్ కు అటెండ్ అయిన దాఖలాలు లేవు. 2 డికేడ్స్ లో మణిశర్మ పాల్గొన్న ఆడియో ఫంక్షన్ ఒకటే ఒక్కటి. అది నాని-నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన దేవదాసు మూవీ ఆడియో ఫంక్షన్ లో. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ రామ్ ఆదిత్య మణిశర్మ రావాలని పట్టుపట్టడంతో ఈ సినిమా ఆడియో రిలీజ్ కు వచ్చారట. ఇక ఆ సందర్భంగా మాట్లాడిన మణిశర్మ నేను మొదటిసారి ఇలా మాట్లాడుతున్నా అని కూడా అంటారు. మరి కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా… అలానే మణిశర్మకు అది ఏమైనా సెంటిమెంట్ ఏమో.. లేకపోతే ఇన్నేళ్ళలో ఒక్క ఆడియో ఫంక్షన్ కు మాత్రమే రావడం అంటే అంతే అయివుండొచ్చు కదా..

ఇక రీసెంట్ గా పూరీ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్ళీ తన సత్తా చూపించాడు మణిశర్మ. ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. దీనితో ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా అవకాశాలు అందుకుంటూ మళ్ళీ తన బలాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం రామ్ రెడ్.. వెంకటేష్ అసురన్ రీమేక్ నారప్ప.. చిరంజీవి, కొరటాల శివ ఆచార్య సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలతో బిజీ గా ఉన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.