లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ తమ పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు తమ అభిమానులకు కూడా పుట్టినరోజు వేడుకలు జరపొద్దని… ప్రస్తుతం పరిస్థితులు బాలేదని.. అందరు ఇళ్లలోనే వుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఇక ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ కూడా తన అభిమానులకు అదే పిలుపునిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ.. సామాజిక దూరం పాటిస్తూ ఈ మహమ్మారి కరోనా వైరస్‌ని అరికట్టడం మన బాధ్యత. జరుగుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో, పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకుని మీ/మన క్షేమం కొరకై ఈ సంవత్సరం నేను పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదు. కావున మీరు కూడా ఎలాంటి సన్నాహాలు జరపకుండా, మీరు మీ కుటుంబ సభ్యులతోనే క్షేమంగా ఉంటారని భావిస్తున్నాను. పరిస్థితులు అన్నీ చక్కదిద్దుకున్నాక మరలా మనం ఎప్పటిలాగే కలుస్తాం అని బలంగా నమ్ముతున్నాను. అప్పటి వరకు అధికారుల సూచనలను పాటిస్తూ.. భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను.’’ అని ఆకాష్ పూరి ట్విట్టర్ ద్వారా ఓ లేఖను విడుదల చేశాడు.
A humble request to all my fans. pic.twitter.com/4eHfbu8WGH
— Akash Puri (@ActorAkashPuri) July 23, 2020
ఆకాష్ పూరీ బాలనటుడిగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆ తర్వాత.. ఆంధ్రా పోరి, మెహబూబా సినిమాలతో హీరోగా పరిచయమైనా ఆ సినిమాలు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. ప్రస్తుతం అనిల్ పాడూరిదర్శకత్వంలో ‘రొమాంటిక్’ సినిమాతో రాబోతున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























