వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు , నిర్మాత అశ్వనీదత్, మెగా స్టార్ చిరంజీవి , అద్భుత సౌందర్య రాశి శ్రీదేవి , సంగీత దర్శకుడు ఇళయరాజా అపూర్వ కలయిక లో రూపొందిన సూపర్ నేచురల్ ఫాంటసీ మూవీ “జగదేకవీరుడు అతిలోక సుందరి “1990 సంవత్సరం మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ని వర్షాలను లెక్కచేయకుండా ప్రేక్షకులు ఆదరించారు. శ్రీదేవి దేవకన్యగా నటించి తన ముద్దు మాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ లో హీరోయిన్స్ షాలిని , షామిలి చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ సెట్టింగ్స్ తో దర్శకుడు రాఘవేంద్ర రావు “జగదేకవీరుడు అతిలోక సుందరి ” మూవీ ని ఒక దృశ్య కావ్యంగా తెరకెక్కించారు. ఈ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. సంగీత దర్శకుడు ఇళయ రాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. ముఖ్యంగా “అబ్బ నీ తియ్యని దెబ్బ “సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ సాంగ్ ఎక్కడో ఒకక్కడ వినిపిస్తూనే ఉంటుంది. పద్మ విభూషణ్ ఇళయరాజా , పద్మభూషణ్ చిరంజీవి , పద్మశ్రీ గ్రహీతలు శ్రీదేవి , అల్లు రామలింగయ్య , బ్రహ్మానందం “జగదేకవీరుడు అతిలోక సుందరి ” మూవీ కి పనిచేయడం విశేషం. తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































