జపాన్ లో “సాహో” మూవీ రికార్డ్

Rebel Star Prabhas Action Entertainer Saaho Set New Records In Japan

యు వి క్రియేషన్స్ , ట్-సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో ” మూవీ తెలుగు లో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ “బాహుబలి” ,”బాహుబలి 2″ మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. “సాహో ” మూవీ జపాన్ దేశంలో జనవరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే కరోనా కారణం గా థియేటర్స్ బంద్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తం గా కార్యకలాపాలు అన్నీ స్తంభించి పోయాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలలో సాధారణ కార్యకలాపాలు మొదలవుతున్నాయి. జపాన్ లో థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత “సాహో ” మూవీ రీ రిలీజ్ అయింది. జపాన్ లో తొలిరోజు అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం గా “సాహో ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకు ముందు ఆ రికార్డ్ అమీర్ ఖాన్ “దంగల్ ” మూవీ పేరిట ఉండేది. జపాన్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన టాప్ 5 ఇండియన్ ఫిల్మ్స్ లో “సాహో ” మూవీ చేరింది. “ఇంగ్లీష్ వింగ్లీష్ “, “3ఇడియట్స్ “, “ముత్తు “, “బాహుబలి 2” మూవీస్ సరసన “సాహో ” మూవీ నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.