తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా తన సినిమాలతో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. గజినీ, సింగం చిత్రాలతో తెలుగులో కూడా తనకంటూ ఒక ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య సినిమా వస్తుందంటే అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు సూర్య బర్త్ డే కావడంతో సూర్య కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం సుధ కొంగర డైరెక్ట్ చేస్తోన్న ‘ఆకాశమే నీ హద్దురా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ రోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఓ పాటను నిర్మాతలు విడుదల చేశారు. ‘కాటుక కనులే మెరిసీపోయే పిలడా నిను చూసీ’ అంటూ ఈ పాట సాగుతుంది. ఇక ఈ పాట ఆకట్టుకోవడంతో పాటు.. ఈ పాటలో సూర్య, హీరోయిన్ అపర్ణా బాలమురళి కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. భాస్కరభట్ల సాహిత్యానికి.. సింగర్ ధీ గొంతు కలవడంతో పాటకు మరింత అందం వచ్చింది. ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్, శిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సూర్య, రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి కలిసి నిర్మిస్తున్నారు.
ఇక వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా సూర్య ‘వాడి వాసల్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి కూడా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఇక డిఫరెంట్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























