‘రైటర్’ అవతారం ఎత్తిన నిఖిల్..!

Tollywood Young Actor Nikhil Starts His New Journey As A Movie Writer

ఈ లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. దొరికిన సమయాన్ని ఉపయోగించుకుంటూ వారిలో ఉన్న టాలెంట్స్ ను బయటపెడుతున్నారు. కొత్త కొత్త వంటలు నేర్చుకుంటున్నారు… ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. సంగీతం నేర్చుకుంటున్నారు…ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ కూడా కొత్త అవతారం ఎత్తాడు. లాక్ డౌన్ లో రైటింగ్ కు సంబంధించి ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా మెళకువలు నేర్చుకున్న నిఖిల్ ఇప్పుడు రైటింగ్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నిఖిల్ ట్విట్ట‌ర్‌లో‌ ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. రైటింగ్ ‘లైఫ్ లో కొత్త అడ్వెంచర్’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనితో నెటిజన్స్ కూడా పలు కామెంట్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ2’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18పేజీస్” సినిమాలో కూడా నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఇక కరోనా కారణంగా ఈ మూవీస్ షూటింగ్స్ ఆగిపోయాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.