సక్సెస్ ఫుల్ “హ్యాపీ డేస్ ” మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ “యువత “, “స్వామి రారా “, “కార్తికేయ “, “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అర్జున్ సురవరం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ “కార్తికేయ ” మూవీ సీక్వెల్ “కార్తికేయ 2”, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ ” మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో ఫిట్ నెస్ కొనసాగిస్తూ నిఖిల్ మళ్ళీ సిద్ధం అంటూ ఇటీవల ఒక ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. నిఖిల్ సిక్స్ ప్యాక్ తో ఉన్న ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించిన “18 పేజెస్ ” మూవీ లో నిఖిల్ ఫస్ట్ టైమ్ మతిమరపు క్యారెక్టర్ లో నటించనున్నారని సమాచారం. ఈ మూవీ ని GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రూపొందుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: