తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొసాగుతున్నారు. “ఓ బేబీ ” ఘనవిజయం తరువాత కథానాయిక కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సమంత ఎంపిక చేసుకుంటున్నారు. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్దతిలో కూరగాయలు పండిస్తూ, యో గా , పెట్ డాగ్ హ్యాష్ తో ఆడుకుంటూ సమంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ట్రెడిషినల్ , మోడరన్ , క్యాజువల్ అవుట్ ఫిట్స్ తో అందంగా కనపడడం సమంత ప్రత్యేకత. మూవీ లోని క్యారెక్టర్, డ్రెస్ ను బట్టి సమంత అందం ద్విగుణీకృతం అవుతుందనడం లో అతిశయోక్తి లేదు. ఫ్యాషన్ ఐకాన్ సమంత డ్రెస్ సెలక్షన్ కు అందరూ ఫిదా అవుతారు. సమంత లేటెస్ట్ అవుట్ ఫిట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. వైట్ సమ్మర్ డ్రెస్ లో తన పెట్ డాగ్ తనను చూస్తున్న ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో సమంత షేర్ చేశారు. తనను ఎప్పుడూ చూడనట్టుగా అతని (డాగ్ ) చూపులు ఉన్నాయని , బొమ్మలు , గేమ్స్ , ఫుడ్ వంటి వాటితో అతని లో అదే లుక్ ఉండేలా చేయాలని తెలుసుకున్నాననే క్యాప్షన్ ను సమంత జత చేశారు. ఆ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























