థ్యాంక్స్ కేసీఆర్ సర్.. ఇప్పుడు భాద్యత మాపై ఉంది..!

Tollywood Ace Director SS Rajamouli Thanks KCR For Giving Permission To Resume Movie Shooting Works In Telangana
Tollywood Ace Director SS Rajamouli Thanks KCR For Giving Permission To Resume Movie Shooting Works In Telangana

సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇవ్వమని చిరంజీవి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినిమా షూటింగ్ లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతినిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో తక్కువ మంది సిబ్బందితో, ప్రభుత్వ ఇచ్చిన నిబంధనలను పాటిస్తూ సినిమా/టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోడానికి కేసీఆర్ అనుమతినిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పందించి థాంక్స్ చెప్పారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి థాంక్స్. మా విజ్ఞప్తి మేరకు తిరిగి షూటింగ్ లు జరుపుకోడానికి అనుమతించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు… ఇప్పుడిక బాధ్యత మాపై ఉంది. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను, సిఫార్సులను అమలు చేస్తూ, తిరిగి పనిలో దిగాల్సిన సమయం. ఉపాధి సిద్ధమైంది” అని ట్వీట్ లో పేర్కొన్నారు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ కరోనా కనుక రాకపోయి ఉంటే ఈ పాటికి సినిమా షూటింగ్ పూర్తయి ఉండేది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.