ఆ సినిమా తర్వాతే ‘ఆదిత్య 369’ సీక్వెల్..!

Nandamuri Balakrishna Aditya 369 Movie Sequel To Hit The Floors After Completing Boyapati Srinu Movie
Nandamuri Balakrishna Aditya 369 Movie Sequel To Hit The Floors After Completing Boyapati Srinu Movie

ఆదిత్య 369 సీక్వెల్.. ఇప్పుడు కాదు గత కొన్నేళ్లుగా ఈ సీక్వెల్ గురించి వింటూనే ఉన్నాం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఆదిత్య 369’ అప్పట్లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు అప్పట్లో. నిజానికి బాలయ్య 100వ చిత్రంగా ‘ఆదిత్య 369’ సీక్వెల్స్ రావాల్సింది. అయితే అనుకోని కారణాల వల్ల ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ తరువాత బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అవ్వడం ఆ తర్వాత వరుస సినిమాలు చేయడంతో బిజీ అయిపోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరోసారి ఈ సీక్వెల్ తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయిపోయేంత వరకూ మరొక సినిమాను సెట్స్ పైకి తీసే ఆలోచనలో లేడంట. అయితే బోయపాటి సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆదిత్య 369 సినిమా సీక్వెల్ తీస్తే ఆ సినిమాకు సింగీతం శ్రీనివాసే దర్శకత్వం వహించనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇవి కేవలం వార్తలేనా.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఇక ఇదిలా ఉండగా బోయపాటి సినిమా తర్వాత సీనియర్ దర్శకుడు బి గోపాల్ డైరెక్షన్ లో కూడా సినిమా చేయనున్నాడు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని బాలయ్య 60వ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. మరి ముందు సీక్వెల్ స్టార్ట్ చేస్తాడా? బి.గోపాల్ సినిమా స్టార్ట్ చేస్తాడా? చూద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eight =