ఒక సినిమా హిట్ అయిందంటే దాన్ని సీక్వెల్ తీయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్ తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమల్లో కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి.. ఇంకొన్ని సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో హీరో కూడా సీక్వెల్ కు రెడీ అవుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య. నాలుగేళ్ళ క్రితం సూర్య కథానాయకుడుగా విక్రంకుమార్ దర్శకత్వంలో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ ’24’ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై విక్రమ్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ కుమార్.. 24 సినిమా సీక్వెల్ ఉందని.. ప్రస్తుతం స్క్రిప్టు పని జరుగుతోందని చెప్పారు చెప్పారు. ఇక ఇదివరకే సింగం సినిమాకు సీక్వెల్స్ తీసి హిట్ కొట్టాడు సూర్య. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే ‘కాప్పాన్’ తెలుగులో ‘బందోబస్త్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య తమిళ్ లో ‘సూరరై పోట్రు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్‌తో విడుదల కానుంది. దీనితో పాటు మరి కొన్ని సినిమాలు ఉన్నాయి.




మరి విక్రమ్ కుమార్ నాగచైతన్య తో సినిమా చేయనున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు కూడా క్లారిటీ ఇచ్చేసాడు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సూర్య, విక్రమ్ వారి ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత 24 సీక్వెల్ ను స్టార్ట్ చేసే అవకాశం వుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























