ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ 20 సినిమా. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాకు ‘ఓ డియర్’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె దాదాపు ఖరారైనట్టే తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.




ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే రోజుకో వార్త తెరపైకి వస్తూనే వుంది. దైవం చుట్టూ తిరిగే కథ అంటా. అటు సైన్స్ ఇటు దైవం రెండు కోణాల్లో ఈ సినిమా కథ వుండనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























