పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మాధవీలత..!

Nachavule Actress Madhavi Latha Gives Clarity About Her Marriage
Nachavule Actress Madhavi Latha Gives Clarity About Her Marriage

చిన్న హింట్ ఇస్తే చాలు మన నెటిజన్లు వాటికి ఊహాగానాలు ఎన్నో చేస్తారు. అలా మాధవీలత నిన్న చేసిన పోస్ట్ కు ఏవేవో ఊహించేసుకొని ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. `ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాన`ని పోస్ట్ చేసింది. ఇక అంతే నెటిజన్స్ పలు కామెంట్స్ మొదలుపెట్టారు. మాధవీలత పెళ్లి చేసేసుకుందని.. ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. దీంతో, పెళ్లి అంశంపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని… అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని తెలిపింది. తన ట్వీట్ నేపథ్యంలో, అందరూ తనకు విషెస్ చెపుతుంటే తనకు నవ్వొస్తోందని వ్యాఖ్యానించింది. అందరికీ చెప్పే తాను పెళ్లి చేసుకుంటానని తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొత్తానికి ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ ఏమో కానీ టాలీవుడ్ సెలెబ్రిటీల పెళ్లిళ్లకు మాత్రం బాగా కలిసొచ్చినట్టుంది. ఇప్పటికే పలువురు పెళ్లిళ్లు జరుగగా.. త్వరలోనే రానా పెళ్లి కూడా జరగనుంది. మరి చూద్దాం మాధవీలత పెళ్లి కూడా ఈ ఏడాది ఉంటదో.. వచ్చే ఏడాదే ఉంటదో.

మాధవీలత.. నచ్చావులే సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే తర్వాత ఒకటి రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి కానీ అవి పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. సినిమాలకు దూరంగా ఉన్న మాధవీలత ఈ మధ్యనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ పార్టీలో చేరింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 2 =