షూటింగ్ లకు అనుమతి.. షరతులకు భయపడుతున్న నిర్మాతలు..!

Conditions for Telugu Movie Producers For Film Shootings
Conditions for Telugu Movie Producers For Film Shootings

ఈ కరోనా వల్ల సినీ పరిశ్రమకు పెద్ద కష్టాలే వచ్చిపడ్డాయి. ఒక సినిమాలో మనకు నటించే నటీ నటులు తక్కువ మంది కనిపించినా.. సినిమా పూర్తవ్వాలంటే మాత్రం దాని వెనుక కొన్ని వందల మంది ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఇవే ఇబ్బందులు వారి ముందు ఉన్నాయి. చిన్న చిన్న పనులు అంటే ఏవో ఇళ్లల్లో ఉంటూ కానిచ్చేస్తున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ.. షూటింగ్ లు కానీ అలా కుదరని పని. లాక్ డౌన్ తీసేసి అనుమతులు షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా ఎలా పడితే అలా ఇవ్వరని.. కొద్దిమందికి మాత్రమే అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా సమాచారం ప్రకారం… షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కొన్ని షరతులు మాత్రం విధించనున్నట్టు తెలుస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి షూటింగులు చేసుకోవాల్సివుంటుందని అంటున్నారు. అవేంటంటే.. సినిమా షూటింగ్ జరుపుకోవాలంటే.. ఆ సినిమాకు పనిచేసే చిత్ర బృందం మొత్తం ఎవ‌రికీ క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని ముందుగా స‌ర్టిఫికేట్ తెచ్చుకోవాలట. అంతేకాదు.. ఆ చిత్ర యూనిట్ లో ఎవరైనా.. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో చ‌నిపోయిన‌ట్టయితే.. మృతుడి కుటుంబానికి నిర్మాణ సంస్థ రూ.50 ల‌క్ష‌ల న‌ష్ట‌పరిహారాన్ని అందించాలట.

దీనితో షూటింగులు ఎప్పుడు మొద‌ల‌వుతాయా అని ఎదురుస్తున్న వారికి ఇది కాస్త చేదు న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏవో చిన్న షరతులు అంటే ఓకే కానీ అసలే బిజినెస్ జరగక నిర్మాతలు ఇబ్బందులు పడుతుంటే.. మధ్యలో ఈ నష్టపరిహారం అనే కాన్సెప్ట్ గురించే ఆలోచిస్తున్నారట. పొర‌పాటున అలాంటి మ‌ర‌ణం సంభ‌విస్తే బడ్జెట్‌లో అర‌కోటి పెరిగిన‌ట్టే. పెద్ద పెద్ద సినిమాలైతే ఈ న‌ష్ట‌భారాన్నీ మోయ‌డానికి సిద్ధ‌ప‌డొచ్చు. మ‌రీ చిన్న సినిమాలైతే ఆ నిర్మాత‌ల ప‌రిస్థితి ఏమిటి? టీవీ సీరియ‌ళ్ల‌కూ ఇదే నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని స‌మాచారం. అందుకే షూటింగుల‌కు అనుమ‌తి ఇచ్చినా షూటింగ్ లకు వెళ్తారా?లేదా? అన్నది ప్రశ్నగా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.