యన్టీఆర్ ‘రాము’కి 52 ఏళ్ళు

NTR Timeless Classic Ramu Completes 52 Years.

నటరత్న నందమూరి తారక రామారావుకు బాగా అచ్చొచ్చిన దర్శకుల్లో ఎ.సి.త్రిలోకచందర్ ఒకరు. వీరిద్దరి కలయికలో మూడు చిత్రాలు (‘నాదీ ఆడజన్మే’ – 1965, ‘రాము’ – 1968, ‘పవిత్రహృదయాలు’ – 1971) తెరకెక్కగా.. ఆ మూడింటినీ విజయాలు వరించడం విశేషం. అలాంటి కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రమే ‘రాము’. యన్టీఆర్‌కు జోడిగా జమున, పుష్పలత (నూతన పరిచయం) నటించారు. ఈ చిత్రంతో బాలనటుడుగా పరిచయమైన రాజ్‌కుమార్ టైటిల్ రోల్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా.. ఎస్.వి.రంగారావు, నాగయ్య, రేలంగి, పద్మనాభం, రాజనాల, ఎస్.వి.రామదాస్, రమణారెడ్డి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, పెరుమాళ్ళు, గీతాంజలి, సూర్యకాంతం ముఖ్య భూమికలు పోషించారు. హిందీ సినిమా ‘దూర్ గగన్ కి ఛాఓన్ మే’(1964)కి రీమేక్‌గా ‘రాము’ని రూపొందించారు దర్శకనిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాశరథి, ఆరుద్ర, కొసరాజు సాహిత్యం సమకూర్చగా.. ఆర్.గోవర్ధనం అందించిన బాణీలన్నీ విశేషాదరణ పొందాయి. “రా.. రా.. కృష్ణయ్య”, “పచ్చని చెట్టు ఒకటీ” (రెండు వెర్షన్స్), “కలగంటి కలగంటి”, “మంటలురేపే నెలరాజా”, “మామిడికొమ్మ”.. ఇలా ఈ సినిమాలోని ప్రతీ పాట అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఏ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ సమర్పణలో ఉమా ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్.మురుగన్, ఎమ్.కుమరన్, ఎమ్.శ‌రవణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1968 మే 4న విడుదలై ఘనవిజయం సాధించిన ‘రాము’.. నేటితో 52 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.