శేఖర్ కమ్ముల థ్రిల్లర్ మూవీ ?

Fidaa Director Sekhar Kammula To Work On A Thriller Movie After Love Story.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ వంటి ఫీల్ గుడ్ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “ఫిదా” మూవీ ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎమోషన్స్ ను బేస్ చేసుకుని మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. “లవ్ స్టోరీ ” మూవీ తరువాత శేఖర్ కమ్ముల ఒక థ్రిల్లర్ మూవీ కి స్టోరీ రెడీ చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ “కహానీ ” ని శేఖర్ కమ్ముల “అనామిక” గా తెరకెక్కించినా ఎమోషనల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల తనదైన స్టైల్ లో ఒక థ్రిల్లర్ మూవీ ని రూపొందించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.