ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా, రాజకీయ, క్రీడా కారులు ఇలా ఒక రంగానికి చెందినవారు కాదు పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల బయోపిక్ లు తీస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో బయోపిక్ తెరపైకి వచ్చింది. అది ఎవరిదో కాదు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భార్య.. దివంగత విజయ నిర్మల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో సినిమాలో కీర్తి సురేష్ ను అనుకుంటున్నారని… విజయ నిర్మల తనయుడు నరేష్ ఈ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉండగా, ఇప్పటికే సినిమాలో ప్రధాన పాత్ర కోసం కీర్తి సురేష్‌ని సంప్రదించాడని.. కీర్తి సురేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు నరేష్. ఇంత వరకూ మా అమ్మ బయోపిక్ తీయడానికి ఏ ఫిలిం మేకర్ కు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అంతేకాదు..తన బయోపిక్ రాయమని మా అమ్మ నన్ను అడిగింది.. ఇంకా నేను మొదలు పెట్టనుకూడా లేదు.. చిన్నగా మొదలుపెడతా.. ఆమె బయోపిక్ తీయాలంటే చాలా రీసెర్చ్ చేయాలని… ఎంతో నిబద్దత ఉండాలి తెలిపాడు. కనీసం ఒక ఏడాది అయినా టైం పట్టొచ్చు.. ఇక ఈ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తానా? లేదా అన్నది? తర్వాత చూద్దాం అని క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది కదా. విజయ నిర్మల బయోపిక్ రావాలంటే ఇంకో రెండేళ్లు టైం పట్టేలా ఉంది.
సీనియర్ నటి, దర్శకురాలు, గిన్నిస్‌బుక్ రికార్డ్ హోల్డర్ విజయ నిర్మల అనారోగ్యంతో గత ఏడాదిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నటిగా, దర్శకురాలిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందింది విజయ నిర్మల.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























