ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌ను చిత్రబృందం సంప్రదించిందని టాక్. అంతేకాకుండా సంజయ్ దత్‌కు త్రివిక్రమ్ వీడియో కాలింగ్ చేసి మరీ స్టోరీ నెరేట్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ పాత్రకు సరిసమానంగా ఉండే పవర్ ఫుల్ పాత్ర కావడంతో సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.




కాగా ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, పూజా హెగ్డేలను ఎంపిక చేశారని సమాచారం. మరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోల వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























