మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం..!

SS Rajamouli about working with Prabhas again
SS Rajamouli about working with Prabhas again

రాజ‌మౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది. ఒకప్పుడేమో కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి లాంటి సిరీస్ చేసి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు. తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదని రుజువు చేశారు. ఇక ఈ ఇద్ద‌రు మ‌రోసారి జ‌త క‌లిస్తే ఎలా ఉంటుంది. అది ఎప్పుడు నిజమవుతుందో తెలియదు కానీ ఉహించుకోడానికి మాత్రం సూపర్. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఇదే టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్వూ ఇచ్చారు…అందులో మీరు,ప్రభాస్ మళ్ళీ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారు అని అడుగగా.. దానికి రాజమౌళి ప్ర‌భాస్ తో త‌మ అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ద‌ని, సినిమాలు చేస్తున్నా లేక‌పోయినా రెగ్యూల‌ర్ గా క‌లుస్తూనే ఉంటామ‌ని చెప్పాడు. ఇంకా స‌రైన ప్రాజెక్ట్ వచ్చి.. ఇద్దరికీ నచ్చినట్టయితే ఖ‌చ్చితంగా భ‌విష్య‌త్ లో ప్ర‌భాస్ తో సినిమా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు.అయితే, ప్ర‌స్తుతానికి త‌న దృష్టంతా ఆర్.ఆర్.ఆర్ మీదే ఉందని… లాక్ డౌన్ బ్రేక్ ఎప్పుడు పూర్త‌వుతుందా అని ఎదురు చూస్తున్నానని తెలిపాడు.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.