సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో “వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్”గా నిలిచిన చిత్రాల్లో ‘శ్రీమంతుడు’ ఒకటి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా శ్రుతి హాసన్ నటించింది. ఆగర్భ శ్రీమంతుడు బాగా వెనకబడిన ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రికార్డుల పరంగానూ పలు సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ మూవీ.. ఇప్పుడు మరే తెలుగు చిత్రానికి సాధ్యంకాని మరో ఫీట్‌ను సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



ఆ వివరాల్లోకి వెళితే.. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో 99,439,442(99+ మిలియన్ వ్యూస్) మంది వీక్షించారు. మొత్తంగా యూట్యూబ్‌లో ఈ సినిమా జోరు చూస్తుంటే.. త్వరలోనే 100 మిలియన్ వ్యూస్ క్లబ్‌లో చేరడం ఖాయమనిపిస్తుంది. సో.. యూట్యూబ్‌లో 100 మిలియన్ల క్లబ్‌లో చేరే తొలి తెలుగు చిత్రంగా ‘శ్రీమంతుడు’ ఖాతాలో రికార్డ్ నమోదు కాబోతుందన్న మాట. మరి, మున్ముందు ‘శ్రీమంతుడు’ బాటలో ఇంకెన్ని తెలుగు చిత్రాలు 100 మిలియన్ క్లబ్‌లో చేరుతాయో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























