మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఆచార్య’. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కమర్షియల్ ఎలిమేట్స్ తో సామజిక అంశాలను మేళవించి చూపించడంలో కొరటాల దిట్ట కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను చిరు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అందులో ఒకటి ఎప్పటినుండో చెప్పుకుంటున్న లూసిఫర్ ఒకటి. ఈ సినిమా రైట్స్ ను రామ్ చరణ్ ఎప్పుడో తీసుకున్నాడు. తెలుగులో ఈ సినిమాను వివి వినాయక్, పరుశురాం, సుకుమార్ వంటి దర్శకులు తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాను ‘సాహో’ ఫేం సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడని చిరు క్లారిటీ ఇచ్చారు. ఇక తెలుగు నేటివిటీ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేయమని అడుగగా.. సుజిత్ ఆ పనిలో ఉన్నాడు.
ఇక ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు వెంకీమామ తో హిట్ కొట్టిన బాబీ. రీసెంట్ గా ఒక కొత్త కథను మెగాస్టార్ కి వినిపించగా… ఆ కథ చిరుకి కూడా నచ్చిందంట. అయితే ఒకవేళ ఇది కనుక నిజమైతే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఇది నిజమో కాదో చిరునే క్లారిటీ ఇవ్వాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























