ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అలియా తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు తప్పని కూడా క్లారిటీ ఇచ్చారు చిత్రబృందం. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ లో అలియా మే నుండి పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ లోపు ఈ కరోనా హడావుడి తగ్గిపోతుంది.. ఆ వెంటనే ఆర్ఆర్ఆర్ లో చెర్రీతో షూట్ లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా. మిగిలిన భాగాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. రాజమౌళి కూడా టైం వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసేస్తున్నాడు. సో రిలీజ్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. 2021 జనవరి 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: