లాక్ డౌన్ ను సూపర్ గా వాడుకుంటున్న పూరీ..!

Star Director Puri Jagannadh Works On New Movie Script Amid Corona Virus Lockdown
Star Director Puri Jagannadh Works On New Movie Script Amid Corona Virus Lockdown

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కేవలం నిత్యావసర సరుకులు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే తప్పా బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. చాలా మంది ఇంట్లోనే ఉంటూ కరోనా ఇచ్చిన సమయాన్ని కుటుంబంతో గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటూ… ఫ్యామిలీతో… ఆట పాటలతో.. ఇంకొంతమంది గరిటె చేతబట్టి వంటలు చేస్తూ.. ఇలా పలు పనుల్లో బిజీ అయిపోయారు. కొందరు హీరోలు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలు తీస్తుంటే. మరికొందరు పాటల రూపంలో జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక కొంతమంది దర్శకులు అయితే కొత్త స్క్రిప్టులకు పనిచెబుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడట. పూరీ గురించి మనకు తెలిసిందే కదా. కొత్త స్టోరీ రాయాలంటే బ్యాంకాక్ వెళ్లాల్సిందే అని. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. కరోనా వల్ల లాక్ డౌన్. దీనితో పూరీ ఇంట్లో ఉండే కొత్త సినిమా కథను రాసే పనిలో ఉన్నాడట.  లాక్ డౌన్ లో వున్నాం కాబ‌ట్టి ఇంటికే ప‌రిమిత‌మైన పూరి ఇంట్లోనే కాల‌క్షేపం చేయ‌కుండా ప్ర‌స్తుత క్రూషియ‌ల్ పీరియ‌డ్ అనుభ‌వంతో ఓ స్క్రిప్ట్‌ని ప్రిపేర్ చేస్తున్నాడ‌ట‌. అంతేకాదు లాక్ డౌన్ పై కూడా పూరీ మాట్లాడుతూ.. బ్యాంకాక్ బీచ్ లను నిజంగా మిస్ అవ్వట్లేదు.. ఇదో కొత్త అనుభూతి… టైం ప్రకారం తింటున్నా.. వర్క్ ప్రెషర్ లేదు… కొత్త కథను రాస్తున్నా.. ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ చూస్తున్నా.. విజయ్ దేవరకొండ సినిమా ‘ఫైటర్’ మానిటరింగ్ ఇలా పలు పనులు చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి లాక్ డౌన్ సమయాన్ని పూరీ బాగానే వాడుకుంటున్నట్టున్నాడు.

కాగా పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైరస్ కార‌ణంగా చిత్రీక‌ర‌ణ వాయిదా వేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.