నటసింహ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `సింహా`, `లెజెండ్` సంచలన విజయం సాధించాయి. సుదీర్ఘ విరామం అనంతరం… ఈ ఇరువురు ఓ డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం జట్టుకట్టారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



కాగా, ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నేటి (సోమవారం) నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. అంతేకాదు… పోరాట ఘట్టాలతో చిత్రీకరణను ప్రారంభిస్తున్నారని సమాచారం. తొలి షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలిసింది. ఆపై వారణాసిలో మరో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారని చెప్పుకుంటున్నారు.
ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























