వెంక‌టేష్ `మ‌ల్లీశ్వ‌రి`కి ప‌ద‌హారేళ్ళు

venkatesh-malliswari-completes-16-years

అగ్ర క‌థానాయ‌కుడు ‘విక్ట‌రీ’ వెంక‌టేష్‌కి కామెడీ టైమింగ్‌లో తిరుగులేదు. అందుకే ఆయ‌న న‌టించిన ప‌లు కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించాయి. అటువంటి చిత్రాలలో `మ‌ల్లీశ్వ‌రి` ఒకటి. ఇందులో “పెళ్ళి కాని ప్ర‌సాద్” క్యారెక్ట‌ర్‌లో వెంకీ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ముదురు వ‌య‌సు బ్ర‌హ్మ‌చారిగా వెంకీ ప్ర‌ద‌ర్శించిన‌ న‌ట‌న సినిమాకే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా… త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సంభాష‌ణ‌లు, కె.విజ‌య భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ చిత్రాన్ని మ‌రో స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ తెలుగు తెర‌కు నాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వ‌డ‌మే కాకుండా… టైటిల్ రోల్‌లోనూ ద‌ర్శ‌న‌మివ్వ‌డం విశేషం. ఇక ఇతర ముఖ్య‌ పాత్రలలో కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, న‌రేష్, బాల‌య్య‌, ‘ఆహుతి’ ప్ర‌సాద్‌, సునీల్‌, రాజ్య‌లక్ష్మి, హేమ‌, స్మిత త‌దితరులు నటించారు. గ‌జాలా ఓ ప్ర‌త్యేక గీతంలో సంద‌డి చేసింది. `నువ్వు నాకు న‌చ్చావ్`(2001) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత వెంకీ – కె. విజ‌య‌భాస్క‌ర్ – త్రివిక్ర‌మ్ – కోటి – ఎ. శ్రీ‌క‌ర ప్ర‌సాద్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం కూడా అదే బాట ప‌ట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

‘సిరివెన్నెల’ సీతారామ‌శాస్త్రి, భువ‌న‌చంద్ర గీత ర‌చ‌న చేయ‌గా… కోటి స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. “నీ న‌వ్వులే వెన్నెల‌ని”, “గుండెల్లో గులాబీల ముల్లు”, “చెలిసోకు లేత చిగురాకు”, “నువ్వెంత అంద‌గ‌త్తెవైనా”, “జ‌న్మ‌జ‌న్మ‌ల వ‌ర‌మీ క‌ల‌యిక‌”, “నువ్వు ఎవ్వరి ఎదలో” పాటలు అల‌రించాయి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ సంస్థపై డి.సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యాన్ని నమోదు చేసింది. ఫిబ్ర‌వ‌రి 18, 2004న విడుద‌లైన `మ‌ల్లీశ్వ‌రి`… నేటితో 16 వ‌సంతాలు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.