మంచు మనోజ్ కు జోడీ గా తమిళ యాక్ట్రెస్ ?

This Tamil Actress To Play Alongside Manchu Manoj

మంచు మనోజ్ కమ్ బ్యాక్ మూవీ గా “అహం బ్రహ్మస్మి ” రూపొందనున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై నూతన దర్శకుడు శ్రీకాంత్ N రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న “అహం బ్రహ్మస్మి ” మూవీ మార్చి 6వ తేదీ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందనున్న “అహం బ్రహ్మస్మి ” మూవీ తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“అహం బ్రహ్మస్మి ” మూవీ లో మంచు మనోజ్ కు జోడీ గా ప్రముఖ కోలీవుడ్ నటి ప్రియ భవాని శంకర్ ఎంపిక అయ్యారని సమాచారం. “కడై కుట్టి సింగం ” , “మాన్ స్టర్” వంటి మూవీస్ లో హీరోయిన్ గా నటించిన ప్రియ భవాని శంకర్ ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ప్రియ భవాని హీరోయిన్ గా 8 మూవీస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న “ఇండియన్ 2″(భారతీయుడు 2) మూవీ లో ఒక కీలక పాత్రకు ప్రియ భవాని ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.