`వీర` (2011) తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. కాగా, ఈ నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని లాంఛనంగా ప్రారంభించి… మార్చి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… తన గత చిత్రం `రాక్షసుడు`ని తమిళ బ్లాక్ బస్టర్ `రాక్షసన్` రీమేక్ గా తెరకెక్కించిన రమేష్ వర్మ.. ఇప్పుడు రవితేజ కాంబినేషన్ మూవీని కూడా ఓ కోలీవుడ్ మూవీ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. విడుదలకు సిద్ధమైన తమిళ చిత్రం `సతురంగ వేట్టై 2` (అరవింద్ స్వామి, త్రిష) ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని టాక్. మరి.. ఈ కథనాల్లో ఎంత నిజముందో త్వరలోనే స్పష్టత వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























