రాశీఖన్నా.. అందం, అభినయాల మేలికలయిక. దాదాపు ఆరేళ్ళుగా తెలుగునాట నాయికగా రాణిస్తోంది రాశి. ఆసక్తికరమైన విషయమేమిటంటే… టాలీవుడ్ లో `ఏడాదికో హిట్` ఫార్ములాతో ముందుకు సాగుతోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం `ఊహలు గుసగుసలాడే` (2014)తో మొదలుకుని.. `బెంగాల్ టైగర్` (2015), `సుప్రీమ్` (2016), `జై లవ కుశ` (2017), `తొలిప్రేమ` (2018), వెంకీ మామ, ప్రతి రోజూ పండగే (2019) వరకు… ఇలా ప్రతీ ఏడాది విజయపరంపరని కొనసాగిస్తోంది రాశి. ఈ నేపథ్యంలో… ఈ సంవత్సరం రాశి నుంచి వస్తున్న తొలి చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్` కూడా అదే బాటలో కొనసాగుతుందేమో చూడాలి.
[custom_ad]




వాలైంటెన్స్ డే స్పెషల్ గా `వరల్డ్ ఫేమస్ లవర్` నేడు జనం ముందుకు వచ్చింది. ఈ సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే.. రాశి ఖాతాలో మరో హిట్ ఖాయమనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. మరి.. `ఏడాదికో హిట్` ఫార్ములాని మున్ముందు కూడా రాశి కొనసాగిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























