సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన `ముకుంద` (2014)తో కథానాయకుడిగా తొలి అడుగేశాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే నటుడిగా తనదైన ముద్రవేసిన వరుణ్.. ఆపై `ఫిదా`, `తొలిప్రేమ`, `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడీ కొణిదెల వారి హ్యాండ్సమ్ హీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




ఇదిలా ఉంటే.. తన తొలి చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో ఆరేళ్ళ విరామం తరువాత మరో సినిమా చేసేందుకు వరుణ్ సన్నద్ధమవుతున్నాడట. 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ చిత్రం నిర్మితం కానుందని టాక్. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల.. విక్టరీ వెంకటేష్‌తో `నారప్ప` చేస్తున్నాడు. అది వేసవిలో రిలీజ్ కానుంది. అదయ్యాకే వరుణ్, శ్రీకాంత్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కుతుందని సమాచారం. మరి.. `ముకుంద` తరువాత శ్రీకాంత్, వరుణ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























