కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ఈ హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. “నిశ్శబ్ధం”మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




“నిశ్శబ్ధం”మూవీ లో హాలీవుడ్ యాక్టర్ “కిల్ బిల్” మూవీ ఫేమ్ మైఖేల్ మ్యాడ్సన్ ఒక కీలక పాత్రలో నటించారు. సియోటెల్ లో జరుగుతున్న షూటింగ్ సమయంలో మైఖేల్ మ్యాడ్సన్ వారం రోజులు కనపడకుండా చిత్ర యూనిట్ ను కంగారుపెట్టారు. మైఖేల్ మ్యాడ్సన్ మేనేజర్ ని సంప్రదించగా అతను తెలియదని చెప్పడంతో చిత్ర యూనిట్ అయోమయంలో పడింది . రిటర్న్ జర్నీ టికెట్స్ బుక్ కావడం తో మైఖేల్ ను ట్రేస్ చేయడానికి 25 లక్షల రెమ్యునరేషన్ తో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని చిత్ర యూనిట్ నియమించింది. ఎట్టకేలకు మైఖేల్ షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్ర నిర్మాతలలో ఒకరైన స్టార్ రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ .. ఎన్ని అడ్డంకులు వచ్చినా “నిశ్శబ్ధం”మూవీ నిర్మించడానికి ప్లాన్ చేశామని, మైఖేల్ మ్యాడ్సన్ వెరీ ట్యాలెంటెడ్ పర్సన్ అని, అతని పెర్ఫార్మెన్స్ తో “నిశ్శబ్ధం”మూవీ గుర్తింపు పొందుతుందనే ,అతని గురించి వెయిట్ చేశామని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























